నగ్నంగా ఉండే యువతులతో మాట్లాడించి డబ్బులు దండుకునే ముఠా చేతిలో చిక్కిన విద్యార్థి వారి వేధింపులు భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఒక యువతి నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ కు ఆకర్షితుడయ్యాడు. వీడియో కాల్ లో యువతి నగ్నం గా కనిపించి మాట్లాడటమే కాకుండా యువకుడు నగ్నంగా ఉండేటట్టు ప్రేరేపించింది. ఆ వీడియోని రికార్డ్ చేసింది. ఆ తర్వాత నుంచి డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టింది. యువకుడు స్పందించకపోవడంతో నగ్నంగా తనతో మాట్లాడిన వీడియో లను యూట్యూబ్ లో పెడతానంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది.

24 వేల రూపాయలు వారిచ్చిన అకౌంట్ కు పంపిన బెదిరింపులు ఆగలేదు. ఇంకా కావాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ముఠా వేధింపులకు భయపడిన యువకుడు 4 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి వచ్చాడు. తన పొలం దగ్గర పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువకుడిని సికింద్రాబాద్ కి తరలించి చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. పోలీసులు హనీ ట్రాప్ ముఠా కోసం గాలిస్తున్నారు.

image source

x