మెదక్ జిల్లాలో పెళ్లి వేడుకలో పూజారి తన చేతివాటం చూపించాడు. వివాహం జపించాల్సిన పంతులే ఏకంగా పెళ్లికూతురు మంగళసూత్రాన్ని మాయం చేశాడు. మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామం లో ఈ నెల 16న ఒక జంటకు వివాహం జరిగింది. పెళ్లి పూర్తయ్యాక పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు లేదని గమనించిన కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. పెళ్లి టైంలో తీసిన వీడియో రికార్డింగ్ చూడగా పంతులు మంగళసూత్రాన్ని మాయం చేసిన దృశ్యాలు కనిపించాయి. అమ్మాయి మెడలో ఉండాలిసిన మూడు తులాల తాళిబొట్టు పురోహితుడు తన జేబులో వేసుకున్నాడు. దీనితో కుటుంబ సభ్యులు పురోహితుడు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

x