ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి, ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు మనం తప్పకుండా పాటించాలి. నియమాలను ఉల్లంఘించిన వ్యక్తుల పై ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తుంది. ఆ వ్యక్తుల పై ప్రభుత్వం జరిమానా రూపంలో జరిమానాలు వసూలు చేస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ యొక్క తీవ్రత కారణంగా, తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 11 నుండి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ లేకుండా బహిరంగా ప్రదేశాలలో తిరుగుతున్నా వారికి రూ .1000 జరిమానాను ప్రభుత్వం వసూలు చేస్తుంది.

మాస్క్ లేకుండా బహిరంగా ప్రదేశాలలో తిరుగుతున్నా వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ‘నో-మాస్క్’ పేరుతా తెలంగాణాలో మే 1 నుంచి మే 14 వరకు మొత్తం 3,39,412 కేసులు నమోదు అయ్యాయి. నమోదైన కేసుల ద్వారా జరిమానా రూపంలో 31 కోట్లు వసూలు చేసినట్లు తెలంగాణ హైకోర్టుకు పోలీసులు తెలిపారు.

విషయం ఏమిటంటే, కరోనా సెకండ్ వేవ్ వల్ల జరుగుతున్న నష్టం గురించి ప్రజలకు పూర్తి జ్ఞానం ఉంది, అయిన ప్రజలు మాస్క్ ధరించకుండా బహిరంగా ప్రదేశాలలో తిరుగుతున్నారు. ఈ జరిమానాల వల్ల అయినా కనీసం ప్రజలు మాస్క్ ధరిస్తారు మరియు ఇది ఇతరులను సురక్షితంగా ఉంచడంలో కనీసం సహాయపడుతుంది.

image source

x