తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ యొక్క నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అనవసరంగా రోడ్ పైకి వస్తే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరో వైపు మాస్క్ లేకుండా రోడ్ పై ప్రయాణించే వారికి కూడా జరిమానా విధిస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టు లో సమర్పించిన నివేదికల ప్రకారం మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వ్యక్తులకు రూ. 37.94 కోట్ల రూపాయిల జరిమానా విధించినట్లు తెలుస్తుంది. మరో వైపు బ్లాక్ మార్కెట్లో కరోనా మెడిసిన్స్ అమ్ముతున్న వారిపై 160 కేసులు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు.

ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు చేశామని ఆయన నివేదికలో పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించని వ్యక్తుల పై దాదాపు 48,643 కేసులు నమోదు చేశామని, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరో వైపు మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిని గుర్తించి 4.56 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

x