కరోనా మనుషుల యొక్క జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఒక పక్క కరోనాను ఎదుర్కోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మరోపక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా ను అడ్డుపెట్టుకొని ఎలా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నాయి. ఈ ప్రైవేట్ హాస్పటల్స్ అధిక ఫీజుల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయం పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా రోగుల నుంచి అధిక వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని తెలంగాణలోని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పటల్స్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు కరోనా చికిత్స ధరలపై కొత్త జీవో ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా యొక్క థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎంతవరకు సమర్థంగా ఉందొ చెప్పాలని కోరింది. థర్డ్ వేవ్ కు సంబంధించి బ్లూ ప్రింట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణహైకోర్టు.

x