నన్ను మీరేమీ పట్టుకోలేరు గానీ, మా రాష్ట్రానికి వచ్చారు కాబట్టి మీ సమీపంలోనే ఓ మంచి హోటల్ ఉంది అక్కడ భోజనం బాగుంటుంది హాయిగా తినేసి వెళ్లిపోవాలంటూ ఒక దొంగ హైదరాబాద్ పోలీసులకు సవాలు విసిరాడు.

హైదరాబాద్లో నిర్మాత కారు దొంగలించి రాజస్థాన్ పారిపోయిన దొంగ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. పైగా పోలీసులకు వాట్స్అప్ కాల్ చేసి తన ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోవాలని సూచిస్తున్నాడు. కనీసం అలాగైనా తనను పట్టుకుంటారో లేదో చూద్దామని అంటున్నాడు. అంతేనా తనకు తానుగా దొరికితే తప్ప మీరు నన్ను పట్టుకోలేరంటూ పోలీసులను రెచ్చగొట్టాడు.

ఈ దొంగది రాజస్థాన్. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ కి వచ్చే సెలెబ్రేటిస్ కారులను దొంగతనం చేయడమే అతని పని. ఇటీవల ఒక నిర్మాత కారును కూడా కొట్టేశాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఆరాధిస్తూ పోలీసులు రాజస్థాన్ వరకు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళినా పోలీసులు అతని ఇంటి ఆచూకీ తెలుసుకున్నారు.

అప్పటికే ఆ దొంగ పై 56 కార్లు కొట్టేసిన కేసులు ఉన్నట్లు గుర్తించారు తర్వాత ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు. హైదరాబాదు నుంచి తనను పట్టుకోవడానికి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగ వారికి వాట్స్అప్ కాల్ చేశాడు. ఆ దొంగ బంజారా హిల్స్ పోలీసులను శభాష్ అంటూ ప్రశంసించాడు. తనను వెంబడిస్తూ ఇంటి వరకు బంజారాహిల్స్ పోలీసులు మాత్రమే వచ్చారంటు చెప్పాడు.

మరోవైపు నిర్మాత మాత్రం కారు పోతే పోయింది గాని కనీసం అందులో ఉన్న కీలక పత్రాలు అయిన ఇప్పించ వలసినదిగా కోరుతున్నారు. బెంగళూరు నుంచి ఒక పని కోసం హైదరాబాద్ వచ్చిన మంజునాథ్ అనే నిర్మాత హైదరాబాద్ లోని ఓ హోటల్ లో దిగాడు. అయితే అక్కడే మకాం వేసిన దొంగ దానిని దొంగలించి పరారయ్యాడు. అయితే ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి పట్టుకో లేరంటూ సవాల్ విసరడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

x