నల్గొండ జిల్లా లో ట్రాక్టర్ బోల్తా పడి 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, మాదాల గ్రామానికి చెందిన వారు జానపాడు దర్గా దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డమర్చార్ల మండలం, సూన్య పాడు గ్రామంలోని మూసీ నది వంతెన వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఒకవైపు కు పడిపోయింది. గాయపడినవారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన వారు. వీరంతా ఇప్పుడు మిర్యాలగూడ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారి అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల స్థానికులు మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటన ఎలా జరిగిందంటే ఎదురుగా ఒక వాహనం రావడంతో ట్రాక్టర్ డ్రైవర్ దాన్ని గమనించకుండా ఒక్కసారిగా ట్రాక్టర్ ను పక్కన తిప్పాడు దీనితో ట్రాక్టర్ బోల్తా పడినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.

x