ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

ఈ సినిమాలో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమాను “ది వారియర్” అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో రామ్ ఇంటెన్స్ లుక్ తో అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నారు. ఈ సినిమాతో హీరో రామ్ కోలీవుడ్లో కూడా అడుగుపెట్టనున్నారు.

ఈ సినిమాను తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, కృతి శెట్టి హీరో రామ్ కి జోడిగా నటిస్తుంది.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ యొక్క కొత్త షెడ్యూల్ మొదలైంది.

 

x