చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తర్వాత అదే కత్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, కొన ఊపిరితో ఉన్న యువకుడిని యువతి బంధువులు రాళ్లతో కొట్టి చంపేశారు.

చిత్తూరు జిల్లా కోదండ రెడ్డి నగర్, సాంబయ్య కందిగా లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ నగర్ కు చెందిన సుష్మితా అనే యువతి సీఎంసి హాస్పటల్ లో నర్సు గా పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన చిన్న గ్రానైట్‌ పరిశ్రమ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు గత కొద్దికాలంగా ప్రేమ పేరుతో సుష్మితా ను వేధిస్తున్నాడు. అయితే చిన్నా పై సుస్మిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన చిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న సుష్మితా పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం బయటకు వచ్చి గొంతు కోసుకుని కిందపడిపోయాడు.

ఆ సమాచారాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి ముందు కొన ఊపిరితో ఉన్న చిన్న పై రాళ్లతో దాడి చేశారు. అప్పటికే గొంతు కోసుకున్న చిన్న గ్రామస్తుల రాళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

x