ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో బంధాలు బలైపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కు చెందిన 27 ఏళ్ల యువతి తన జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తోంది. ఈ సంవత్సరం చివర్లో తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. వీరి ప్రేమకు ఇరు వర్గాల పెద్దలు కూడా అంగీకరించారు. అందరు ఇక పెళ్లి పీటలు ఎక్కడమే ఆలస్యం అని అనుకున్నారు.

అంతా మంచిగా జరుగుతున్న సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందించారు. మూడు సంవత్సరాలుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు రోజు ఆమెకు ధైర్యం చెప్తూ ఉండేవాడు. ఆమెను బతికించుకోవడానికి అతను ఎంతో ప్రయత్నం చేశాడు.

ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్స్ వెంటిలేటర్ పై ఉంచి ఆమెకు చికిత్స అందించారు. దీంతో ఆమె పూర్తిగా ధైర్యం కోల్పోయింది. ఇక ప్రేమించిన యువకుడు ఆమెలో ధైర్యం పెంచడానికి హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వెంటిలేటర్ బెడ్ పైనే ఆమె మెడలో తాళి కట్టాడు. క్షేమంగా ఇంటికి వేస్తుందని భావిస్తున్న సమయంలోనే ఆ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి తల్లిదండ్రులకు కూడా కరోనా రావడంతో ఆమె సోదరుడు మరియు ప్రేమించిన వ్యక్తి ఇద్దరు కలిసి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

x