తాలిబన్లు స్వాధీనం తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్లో పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. ప్రజలు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీలులేదని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. కానీ వేలాది మంది స్థానికులు ఏదోక విధంగా దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రజలు ఎయిర్ పోర్టు బయట నరకం చూస్తున్నారు. చాలా మంది ప్రజలు మురికి కాలువ ద్వారా విమానాశ్రయం లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రజలు విమానాశ్రయానికి బయట నిలిచిపోయారు. మంచినీరు, ఆహారం లేక అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు.

కొంతమంది దుర్మార్గులు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను సొమ్ము చేసుకుంటున్నారు. మంచినీరు తాగాలన్న, భోజనం చేయాలన్న అక్కడ రేట్లు అదిరిపోతున్నాయి. కేవలం ఒక వాటర్ బాటిల్ ధర $ 40 డాలర్లు అంటే సుమారు 3 వేల రూపాయలు, ఒక ప్లేట్ భోజనం ధర $ 100 డాలర్లు అంటే సుమారు7,500 రూపాయలు. అంతేకాదు, మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, విక్రయదారులు ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీని అంగీకరించడం లేదు. వారు యుఎస్ కరెన్సీని మాత్రమే తీసుకుంటున్నారు.

x