హైదరాబాద్ కూకట్పల్లి ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎటిఎం లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ పై మొదట కాల్పులు జరిపారు. ఆ తర్వాత డబ్బులు నింపుతున్న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

x