ఇటీవల అక్కినేని హీరో సుమంత్ పేరుతో ఒక పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో సుమంత్ పవిత్ర అనే ఒక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అందరు భావించారు. కానీ, అది నిజం కాదు.. ఆ శుభలేఖలు సుమంత్ రాబోయే సినిమాకు సంబందించినవి.. కానీ, అవి లీక్ కావడంతో నిజంగా పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి అని నిన్న సుమంత్ క్లారిటీ ఇచ్చాడు.

శుభలేఖల గురించి క్లారిటీ వచ్చిన కొన్ని గంటల తర్వాత, సుమంత్ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ‘మళ్లీ మొదలైంది’ అనే టైటిల్ తో విడుదల చేశాడు. ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను షేర్ చేస్తూ, సుమంత్ ఇలా వ్రాశాడు, “తెలుగు సినిమాలో తొలిసారిగా విడాకులు మరియు పునర్వివాహం గురించి ఒక అద్భుతమైన కథ రానున్నట్లు” ఆయన చెప్పారు.

ఈ సినిమాలో ‘నైనా గంగూలీ’ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా, రాజశేఖర్ రెడ్డి అనే నిర్మాత దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది మరియు విడుదలకు సిద్ధమవుతోంది.

x