నెల్లూరు జిల్లాలో ఓజిలి మండలం లో ఒక విషాద సంఘటన జరిగింది. సరదాగా ముగ్గురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారు. ఆ ముగ్గురు చిన్నారులను కాపాడటానికి ప్రయత్నించినా మరో వ్యక్తి కూడా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన ఓజిలి మండలం రాజుపాలెం లో జరిగింది.

రాజుపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు హేమంత్(6), చరణ్ తేజ్(8), జాహ్నవి(12) ఆడుకోవడం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆ ముగ్గురు చిన్నారులు చెరువులో పడ్డారు. ఆ ముగ్గురిని కాపాడటానికి ఖలీల్(45) అనే వ్యక్తి ప్రయత్నించాడు. కానీ అతను కూడా చిన్నారులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

x