కరోనా వైరస్ యొక్క రెండవ దశ దేశం మొత్తాన్ని కదిలించింది. ఈ మహమ్మారి వల్ల సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అల్లు అర్జున్ యొక్క పుష్ప, చిరంజీవి యొక్క ఆచార్య మరియు వెంకీ, వరుణ్ తేజ్ యొక్క ఎఫ్3 సినిమా షూటింగ్స్ కరోనా వల్ల ఆగిపోయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్స్ సుకుమార్, కొరటాల శివ మరియు అనిల్ రావిపూడి మాత్రం బిజీగా ఉన్నారు.

దర్శకుడు సుకుమార్ విజయ్ దేవరకొండ యొక్క చిత్రానికి స్క్రిప్ట్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి బాలయ్య కోసం రాసుకున్న కథను చక్కగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కొరటాల శివ ఎన్టీఆర్ 30 వ చిత్రం కోసం స్క్రిప్టు ను రెడీ చేస్తున్నారు. వారు తదుపరి సినిమాల కోసం ఈ కాళీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు.

x