తండ్రి కోసం మూడు ఏళ్ల బాలుడు అడవిలోకి వెళ్లి తప్పి పోయాడు. వారం రోజుల నుంచి ఎంత వెతికిన ఆచూకీ మాత్రం దొరకలేదు. తప్పిపోయిన బాలుడు కోసం తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నెల్లూరు జిల్లా లో మూడు సంవత్సరాల పిల్లవాడు అదృశ్యం అవ్వటం సస్పెన్స్ గా మారింది.
వివరాల్లోకి వస్తే, నెల్లూరు జిల్లా ఉయ్యాల పల్లి అరుంధతి వాడ కు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మి లకు మూడేళ్ల కుమారుడు సంజు మరియు ఒక సంవత్సరం పాప ఉన్నారు. బుజ్జయ్య గొర్రెలను కాస్తు కుటుంబాన్ని నడుపుతూ ఉండేవాడు. వరలక్ష్మి వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ ఉండేది. బుచ్చయ్య ప్రతిరోజు గొర్రెలను తోలుకొని సమీపంలో ఉన్న వెలుగొండ అడవిలోకి వెళ్తారు.
ప్రతిరోజు లాగానే జూన్ 29న గొర్రెలను తీసుకొని అడవిలోకి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత తండ్రిని అనుసరిస్తూ సంజు అడవిలోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజులు గడుస్తున్నా పిల్లవాడు ఆచూకీ తెలియలేదు. అడవిలోకి వెళ్లి తప్పిపోయారని భావిస్తున్నారు. చిన్నారి కోసం గాలిస్తున్న పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించినా కూడా ప్రయోజనం దక్కలేదు.
దీంతో పోలీసులు ‘డాగ్ స్క్వాడ్’ సాయంతో గాలింపు చేపట్టనున్నారు. పిల్లవాడు తిరిగి వస్తాడని ఎంతో ఆసక్తిగా తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అడవిలో ఉన్న పరిస్థితులు తలుచుకొని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పిల్లవాడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు.