ప్రతిష్టాత్మక టోక్యో ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ‘పీవీ సింధు’ శుభారంభం చేసింది. గ్రూప్ జె తొలి మ్యాచ్లో ఇజ్రాయెల్ కి చెందిన సెనియా పొలికర్పోవా పై పీవీ సింధు విజయం సాధించింది. సెనియా పై 21-7, 21-10 తేడాతో సింధు విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు ఎంపిక అయ్యింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం లో భారత్ కు నిరాశ ఎదురైంది. మను భాకర్ మరియు యశస్విని ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫైంగ్ మ్యాచ్‌లో మను భాకర్ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు. రోయింగ్ లో భారత్ శుభారంభం చేసింది. అరుణ్ లాల్, అరవింద్ సింగ్ జోడి లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రీప్ ఛెజ్ విభాగంలో టాప్ 3 లో నిలిచారు. దీంతో వారు సెమీ ఫైనల్ కు అర్హత సాధించారు. ఈనెల 27న ఈ పోటీలు జరుగుతాయి.

x