కరోనా వల్ల సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు ఏంటో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వల్ల ఎంతో మంది జర్నలిస్టులు సైతం తుది శ్వాస విడిచారు. గత నలభై రోజుల్లో సుమారు 50 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు అని తెలుస్తుంది. ఈ లిస్టులో టాలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సెలబ్రిటీల ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ గా పేరుపొందిన (టి ఎన్ ఆర్) తుమ్మల నరసింహ రెడ్డి గారు కూడా ఈ ఉదయం కరోనా వల్ల మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం టిఎన్‌ఆర్‌కు వైరస్ సోకింది. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు.

రోజులు గడిచిపోయాయి, కాని టిఎన్ఆర్ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. అయితే రెండు రోజుల నుంచి ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదు చివరికి కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి అనేక అనేకమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన క్రైమ్ రిపోర్టర్ గా కెరియర్ ప్రారంభించారు. టి ఎన్ ఆర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేశారు. దీనితో ఆయన చిత్ర పరిశ్రమలో తిరుగులేని పట్టును సాధించాడు. ప్రముఖ కథ, డైలాగ్ రచయిత ఎల్.బి.శ్రీరామ్ దగ్గర అసిస్టెం ట్ గా చేశారు.

డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో టి ఎన్ ఆర్ టాక్ షో పేరుతో ఆయన సినీ ప్రముఖులతో నిర్వహించిన ఇంటర్వ్యూ లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. అతను గత దశాబ్దంలో వందలాది మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు మరియు వారు మిలియన్ల వీక్షణలను సంపాదించారు. ఆ ఇంటర్వ్యూ లు వల్ల ఆయనకు మంచి గుర్తింపు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారు.

x