కరోనా థర్డ్ వేవ్ మరోసారి దర్శకులకు కావాల్సినంత సమయాన్ని ను తీసుకువచ్చింది. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు వాయిదా పడటంతో డైరెక్టర్లు తరువాత ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఎవరు ఏ హీరో కోసం కథలు రెడీ చేసుకుంటున్నారో చూద్దాం.

ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 18 లేదా ఏప్రిల్ 28 కి వెళ్లిపోవడంతో రాజమౌళికి మూడు నెలలు ఖాళీ సమయం దొరికింది. మూడు సంవత్సరాల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లాలని అనుకున్నాడు. కానీ, కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తో బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబు తో మూవీ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కథను సెట్ చేసే పనిలో ఉన్నారు. మహేష్ బాబు మాత్రం ముందు సర్కారు వారి పాట, ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమాని పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్యాప్ లో రాజమౌళి మహేష్ తో ఎలాంటి జోనర్ మూవీని తెరకెక్కించాలో ఆలోచించుకోవచ్చు.

కరోనా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కథ రెడీ చేసుకునే ‘అనిల్ రావిపూడి’ ఈసారి బాలయ్య సినిమా గురించి ఆలోచిస్తున్నారు. ఎఫ్ 3 షూటింగ్ పూర్తి కావడంతో తర్వాత ప్రాజెక్టు బాలయ్య కోసం కథను సిద్ధం చేసుకోవడానికి చాలా సమయం వచ్చింది. గోపీచంద్ మలినేని సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి మూవీ మొదలవుతుంది.

మరోపక్క కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆశ్చర్య’ సినిమా విడుదల ఏప్రిల్ 1కి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ గురించి ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. థర్డ్ వేవ్ తీసుకొచ్చిన గ్యాప్ ను డైరెక్టర్లు అప్ కమింగ్ ప్రాజెక్టులను డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారా.. లేదంటే ఆ తరువాత తీయబోయే సినిమాల గురించి ఆలోచిస్తారా.. అనేది చూడాలి.

x