ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద హీరోలు 40 నుంచి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్యాన్ ఇండియా హీరోలు అయితే 70 నుంచి 100 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్స్ కూడా హీరోలకు మేము ఏమైనా తక్కువ అంటూ రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు.
పూజ హెగ్డే
ఒక్క సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇక స్టార్ డమ్ వస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. హీరోయిన్స్ ఈ విషయంలో సక్సెస్ లేకపోయినా రెమ్యూనరేషన్ కు మాత్రం రెక్కలు వస్తున్నాయి. వరుసగా 5 హిట్స్ తో పూజ హెగ్డే కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘అల వైకుంఠపురం’ సినిమా సూపర్ హిట్ తర్వాత పూజ ‘తగ్గేదే లే’ అంటూ మూడు కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంది.
రష్మిక మందన్న
పూజా రెమ్యూనరేషన్ మూడు కోట్లు దాటిపోవడంతో కీర్తి సురేష్, రష్మిక కూడా పూజా హెగ్డే తో పోటీ పడుతున్నారు. పూజకు అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం లో’ అనే సినిమాతో హిట్ వస్తే, రష్మిక కు అదే అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప తో హిట్ వచ్చింది. దీంతో అప్పటి వరకు 2 కోట్ల రేంజ్ లో ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం మూడు కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంది. పుష్ప అన్ని భాషల్లో రిలీజ్ కావడంతో పుష్ప 2 కోసం ఈ హీరోయిన్ కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలిసింది.
శృతిహాసన్
రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా తో శృతిహాసన్ సూపర్ హిట్ అందుకుంది. శృతిహాసన్ ఈ సినిమా తరువాత తన రెమ్యునరేషన్ ను పెంచేసింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాలార్’ సినిమాలో చేస్తుంది. క్రాక్ సినిమా కు ముందు వరకు శృతిహాసన్ రెమ్యునరేషన్ వార్తల్లో వినిపించలేదు. శృతిహాసన్ గబ్బర్ సింగ్ హిట్ తర్వాత రేసుగుర్రం సినిమా తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది. ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ కోటి రూపాయలకు పైగా ఉంటుంది. అయితే, బాలయ్య సినిమాతో మొదటిసారి రెండు కోట్ల మార్కును దాటింది.
మెహ్రీన్ పిర్జాదా
ఈ మధ్యకాలంలో రెమ్యునరేషన్ ను పెంచేసిన మరో హీరోయిన్ మెహరీన్. ప్రస్తుతం ఈమె ఎఫ్ 3 మూవీ లో చేస్తుంది. ఎఫ్2, మహానుభావుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన ఇంతవరకు ఈమె రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటలేదు. అయితే, ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమా వల్ల ఈమెకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. 50 నుంచి 60 లక్షల లోపు ఉన్న ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్ కోటి రూపాయలు దాటిపోయింది.
కృతి శెట్టి
అదృష్టం అంటే ఎలా ఉంటుందో చెప్పాలి అంటే, ‘కృతి శెట్టి’ ని చూస్తే సరిపోతుంది. ఉప్పెన సినిమాకు ఈమె రెమ్యునరేషన్ 10 లక్షలు. అయితే, ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటింది. పూజ, రష్మిక లాగా కృతి కూడా హ్యాట్రిక్ కొట్టింది. ఉప్పెన తరువాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు హిట్ కావడంతో ఈమెకు లక్కీ హీరోయిన్ అనే ముద్ర పడింది. ఈ బ్రాండ్ కోటి రూపాయల హీరోయిన్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది వారియర్’ లో రామ్ పక్కన, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలో సుధీర్ బాబు తో జతకట్టింది.