కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించి అందరి జీవితాలను నాశనం చేస్తుంది, రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. రోజు రోజుకి సినీపరిశ్రమలో మరణాల వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న పొట్టి వీరయ్య, నిన్న కె.వి.ఆనంద్ గుండెపోటుతో మరణించారు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ “కుమార్ వట్టి” ఈ కరోనా కు బలయ్యాడు.

ఇటీవల దర్శకుడు కుమార్ వట్టి ఈ వైరస్ బారిన పడ్డాడు మరియు చికిత్స కోసం శ్రీకాకుళం జిల్లాలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్నప్పుడు, కుమార్ తుది శ్వాస విడిచాడు. కుమార్ వట్టి మరణానికి ‘విరాటా పర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల సంతాపం తెలిపారు.

కుమార్ వట్టి దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి ముందు, దర్శకుడు పరుశురాం వద్ద సహాయకుడిగా పనిచేశారు. పరుశురామ్ తో కలిసి కుమార్ ‘యువత,’ ‘సోలో’ ‘అంజనేయులు’ మరియు ‘సారొచ్చారు’ కోసం పనిచేశారు. ఈయన “మా అబ్బాయి” అనే సినిమా తో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించగా ఈ మూవీతోనే వట్టి కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కుమార్ యొక్క ‘మా అబ్బాయి’ బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవ్వకపోయిన, అతను హిట్ సాధించాలని నిశ్చయించుకొన్ని తన రెండొవ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. కానీ కోవిడ్ -19 తన ప్రాణాలను తీసింది. ఈయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

x