తౌక్తా తుఫాన్ తీరం దాటిన వెంటనే మరో తుఫాన్ ముంచుకు వస్తుంది. ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి యాస్ అని నామకరణం చేశారు. తుఫాన్ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు దూసుకు వస్తుందని ఐ ఎమ్ డి అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల 26 పశ్చిమబెంగాల్, ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 22న ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అది క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారుతుంది అని వాతావరణ శాఖ చెబుతోంది. మే 26న సాయంత్రం గాని మే 27 సాయంత్రం గాని ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ తో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

x