రైలు రివర్స్ వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది, రైల్వే స్టేషన్ లో ట్రాక్స్ మారేటప్పుడు, ఇంజన్ వెనక్కి వెళ్లడం చూస్తూ ఉంటాం. కానీ ప్రయాణికులు ఉన్నప్పుడు మాత్రం అలా జరగదు.
ఉత్తరాఖండ్లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు ఏకంగా 35 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళింది. ఆ రైలు నిండా ప్రయాణికులు ఉన్నారు. రైలు రివర్స్ గేర్ లో దూసుకువెళ్లడం ప్రయాణికులు వణికిపోయారు. అసలు ఆ ట్రైన్ వెనక్కి ఎందుకు వెళ్ళింది? చివరికి ఏమైంది?
పూర్ణ గిరి జనశతాబ్ది అనే ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని ఖరగ్‌పూర్ బయలుదేరింది. మరికొద్ది గంటల్లో ఖరగ్‌పూర్ కు రైలు వెళుతుందనగా రైల్వే ట్రాక్ పైకి పశువులు వచ్చాయి, పెద్ద సంఖ్యలో పశువులు రావటంతో లోకో పైలెట్ కు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే సడన్ బ్రేక్ వేశాడు.
సడన్ బ్రేక్ వేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ ఆగి పోవాల్సిన ఆ రైలు ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం మొదలు పెట్టింది. లోకో పైలెట్ ఎంత ప్రయత్నించినా ఆగలేదు.
రైలు పై లోకో పైలట్ నియంత్రణ కోల్పోయారు, అలా అలా 35 కిలోమీటర్లు వెనక్కి వెళ్లి రైలు ఆగిపోయింది. రైలు వేగంగా వెనక్కి దూసుకు వెళుతుండగా కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.