క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ వ‌ల్ల ప్రజలు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదురుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి అనేక విదేశీ సంస్థ‌ల‌ నుంచి భారీగా సాయం అందుతోంది. తాజాగా, ట్విట్ట‌ర్ సంస్థ భారతదేశానికి దాదాపు రూ.110 కోట్ల (15 మిలియన్ల డాలర్లు) ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

భారతదేశంలోని కరోనా రోగులకు సాయం చేసేందుకు కేర్ ఎన్జీవో, ఎయిడ్‌ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్‌ కు 15 మిలియన్‌ డాలర్లు విరాళం ఇచ్చాము అంటూ ట్విట్ట‌ర్‌ సీఈవో జాక్‌ పాట్రిక్‌ డోర్సే ట్వీట్ చేశారు. వారు ఇచ్చిన 15 మిలియన్ డాలర్లలో

1. 10 మిలియన్‌ డాలర్లు కేర్‌ ఎన్జీవోకు
2. 2.5 మిలియన్‌ డాలర్లు ఎయిడ్‌ ఇండియాకు
3. 2.5 మిలియన్‌ డాలర్లు సేవా ఇంటర్నేషనల్‌కు ఇచ్చారు.

కేర్‌ ఎన్జీవో

కేర్‌ ఎన్జీవో ద్వారా భారతదేశానికి అవసరమైన తాత్కాలిక కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు చేయడం కోసం ఇది సహాయంగా ఉంటుందని తెలిపారు. అలాగే, ఆసుప‌త్రుల‌కు అవసరమైన ఆక్సిజన్ సైలెండర్లు, మరియు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అవసరమైన పీపీఈ కిట్లు అందుతాయని చెప్పారు.

ఎయిడ్‌ ఇండియా సంస్థ

ఎయిడ్‌ ఇండియా సంస్థ ద్వారా కరోనా రోగులను హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో పాటు వారికీ అవసరమైన చికిత్సలకు అయ్యే ఖర్చు ఈ సంస్థ భరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల కరోనా రోగులకు సాయం అందుతుందని చెప్పారు.

సేవా ఇంటర్నేషనల్‌

తాము అందించిన ఈ విరాళాన్ని సేవా ఇంటర్నేషనల్‌ ఎన్జీవో క‌రోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు మరియు బెడ్స్, మందులు వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేయమని తెలిపారు. వెంటనే ఆ పరికరాలను భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు మరియు క‌రోనా చికిత్స‌ కేంద్రాలకు సరఫరా చేస్తారని చెప్పారు.

x