2021 టీ20 వరల్డ్ కప్ ను భారత్లో నిర్వహించాలనుకున్న బీసీసీఐ(BCCI) కు షాక్ తలిగింది. అక్టోబర్ 18 నుంచి భారత్లో టి20 వరల్డ్ కప్ ను నిర్వహించాలి. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ను యూఏఈ (UAE) కి తరలించినట్లు సమాచారం. భారత్ లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ను యూఏఈ వేదికగా నిర్వహించాలని ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి క్రిక్ ఇన్ఫో వెబ్ సైట్ లో వార్తలు కూడా వస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఇంకా సమయం ఉండి. కానీ ఈలోపే ఐసీసీ తన నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI)కి తెలిపినట్లు తెలుస్తోంది. 14వ సీజన్ ఐపీఎల్ (IPL) యూఏఈ లో అక్టోబర్ 15న కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వారంలో విడుదల కానున్నాయి.

టి20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు క్వాలిఫైయర్ మ్యాచ్లు అక్టోబర్ 15న నుంచి యూఏఈ లో స్టార్ట్ అవుతున్నాయి. ఎనిమిది జట్లు 12 క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడతాయి. ఐపీఎల్ యూఏఈలో జరగటం, ఆ వెంటనే 2021 వరల్డ్ కప్ కూడా అక్కడే జరగడం భారత జట్టుతో కలిసి వస్తుందేమో చూడాలి.

x