తెలంగాణలో ప్రయోగాత్మకంగా డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి డీ జె సి ఎ(DGCA) అనుమతి ఇచ్చింది. మార్చి 9న మెయిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోరగా ఏప్రిల్ 29న సివిల్ ఎలివేషన్ డైరెక్టర్ జనరల్ నుంచి అనుమతి వచ్చింది. ఒక సంవత్సరం పాటు ఈ (DGCA) అనుమతి అమలులో ఉంటుంది.
పౌరుల ఇంటివద్దకే హెల్త్ కేర్ సేవలు అందించడమే లక్ష్యంగా, వైద్య ఆరోగ్య సేవల పంపిణీ దృశ్య, కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించడమే డ్రోన్స్ సేవల లక్ష్యమని, డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ అధ్యయనానికి ఐసీఎంఆర్ (ICMR) అనుమతి ఇచ్చిందంటూ అధికారులు తెలిపారు.