కోవిడ్ మహమ్మారి మనుషులతో పాటు జంతువుల పైన కూడా పంజా విసురుతుంది. తొలిసారిగా 2020 ఏప్రిల్ నెలలో అమెరికాలోని న్యూయార్క్‌ కు చెందిన బ్రాంక్స్ జూలో ఓ పులికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే, ఇటీవలే చెన్నైలోని ఓ నేషనల్ పార్క్ లో ఉన్న రెండు సింహాలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. ఈ పరిస్థితుల్లో జంతువులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

ఇటీవలే జంతువుల కోసం వ్యాక్సిన్ తయారు చేయాలని ఐసీఏఆర్ (ICAR)- ఎన్ఆర్ సీఈ (NRCE)కు పర్యావరణ, అటవీ శాఖ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు హర్యాణాలోని ఐసీఏఆర్ (ICAR) – నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వల్ (NRCE) సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తో ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ను త్వరలోనే మన దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు జూలలో నిర్వహించనున్నారు.

ఈ వ్యాక్సిన్ కేవలం సింహాలు, పులులు మరియు చిరుత పులులకు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే, వీటికి ఇచ్చే వ్యాక్సిన్ కూడా రెండు డోసులు గా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ యొక్క రెండు డోసుల మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. ఒకే జాతికి చెందిన జంతువులు 15కి కంటే ఎక్కువ ఉన్న జూ పార్కు ల్లోనే ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు.

x