కోవిడ్ దెబ్బ నుంచి కోలుకున్న తెలుగు సినిమా మార్కెట్, ఇటీవల వచ్చిన సినిమాలు మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. కానీ వకీల్ సాబ్ కు యూఎస్ లో ఊహించిన ఫలితం రాలేదు.

ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమా యూఎస్ లో మంచి కలెక్షన్స్ అందుకోండి. ఈ సినిమా ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. దీంతో యు.ఎస్ మార్కెట్ పాత స్థితికి వచ్చింది అని అనుకున్నారు. జాతి రత్నాలు సినిమాకు అంతా కలెక్షన్స్ వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయని భావించి ఈ సినిమాను యూఎస్ లో రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఈ సినిమా అక్కడ పెద్దగా వసూలు చేయలేకపోయింది. ఈ సినిమా సుమారు 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా మొదటి వారంలో కేవలం 6 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. కనీసం ఈ సినిమా మొత్తం వసూలు 7.5 లక్షల డాలర్లు కూడా దాటేలా లేవు.

జాతిర‌త్నాలు సినిమా తో యూఎస్ మార్కెట్ మునుపటి స్థాయికి వచ్చిందని భావించి, వ‌కీల్ సాబ్ పెద్ద సినిమా కావడం తో బ‌య్య‌ర్లు మంచి రేట్ ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. కానీ వ‌కీల్ సాబ్ కు అక్కడ బ్రేక్ పడింది. దీనితో యూఎస్ లో ఆ సినిమా కొన్న బయ్యర్లు న‌ష్టాల పాలయ్యారు. ఈ సినిమా తో బయ్యర్లకు తర్వాత వచ్చే సినిమాల విష‌యంలో భ‌యం మొద‌లైంది.

x