పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి, ఆయనకు ఫాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు మూడు సవంత్సరాలు పాటు సినిమాలకు దూరమై ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ అరంగేట్రం చేశారు. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరెకెక్కుతుంది. ఈ సినిమా బాలీవుడ్ సినిమా పింక్ కు రీమెక్. ఈ సినిమా కు వకీల్ సాబ్ టైటిల్ పెట్టారు.

దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ తీసుకొని వచ్చాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నేడు విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వకీల్ సాబ్ మూవీ కథ:

ముందుగా కథ విషయానికి వస్తే అందరికీ తెలిసిన కథే ఇది. మహిళల సమస్యలకు ఓ లాయర్ ఎలా అండగా ఉన్నారన్నదే ఈ కథ నేపథ్యం. ముగ్గురు మహిళలు స్వతంత్రంగా ఉంటూ కలిసి జీవిస్తుంటారు. అయితే ఒక్క రాత్రి జరిగిన ఘటన తర్వాత పరిణామాలు వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారు బాధితులైన కేసును ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.

సాక్ష్యాలు కూడా వారికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఉన్న ఏకైక ఛాన్స్ లాయర్ సత్య దేవ్. అవతల వారికి రాజకీయ పలుకుబడి, పోలీసుల సహకారం ఉన్న లాయర్ సత్యదేవ్ మహిళలకు ఎలా న్యాయం చేయగలరు? అసలు ఆ ముగ్గురు ఎందుకు ఆ పరిస్థితుల్లో చిక్కుకున్నారు? సత్యదేవ్ మరియు నందా మధ్య జరిగిన వాదనలు సమాజానికి ఎలాంటి సంకేతాన్ని ఇచ్చాయి? చేయని తప్పుకు మహిళలు ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా.

సినిమా విశ్లేషణ:

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా మొదలవడం ఒక బలమైన ఎమోషనల్ తో మొదలవుతుంది. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతలు రెండు మార్గాల వైపు ప్రయాణం ఇలా ఆసక్తికరంగా సినిమా కథ మొదలవుతుంది. ఇక వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది అనే దాని ఆధారంగా సాగిన కథనం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక మొదటి 15 నిమిషాలు ఇదే ప్రధానంగా కథ సాగుతుంది. ఆ తర్వాత ఆడియన్స్ నిరీక్షణకు తెర దించుతూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ పవర్ పవర్ ఫుల్ గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు యువతీ యువకుల మధ్య ఏం జరిగింది అనేది తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సాగే కథనం ఆకట్టుకుంటుంది.

ఇక కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. కష్టాల్లో ఉన్న అమ్మాయిలు లాయర్ సత్య దేవ్ దగ్గరకు వెళ్లడం వారి బాధ్యత లాయర్ తీసుకోవడం ఇలా ఒక్కొక్క సీన్ ఆకట్టుకుంటుంది. పవన్ ఈ సినిమాలో మంచి లుక్ తో కనిపించి అభిమానులను అలరించారు. ఇక లాయర్ కోర్టు తో మరింత హుందాగా ఉన్నారు. ఇక సాక్ష్యాలు అన్ని అమ్మాయిలు తప్పు చేసినట్టు ఉన్న తరుణంలో లాయర్ సత్యదేవ్ వారిని ఎలా రక్షించగలిగాడు అనే సీన్లు ఆసక్తిని పెంచేలా చేశాయి.

ముఖ్యంగా అమ్మాయిలను వ్యభిచారులుగా ముద్రవేయడం ఆ దిశగా జరుగుతున్న పరిణామాల పట్ల లాయర్ కలత చెందటం దానికోసం ఎంతకైనా తెగించటం వంటి సీన్లు మెప్పిస్తాయి. లాయర్ నంద దోషులను రక్షిస్తూ, ఎలాగైనా అమ్మాయిలకు శిక్షపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దానికి సత్యదేవ్ చెక్ పెట్టడం వంటి సీన్లు అభిమానులకు ఎంతగాను నచ్చుతాయి. ముఖ్యంగా కోర్ట్ సీన్లు అందులో పవన్ కళ్యాణ్ పలికే సంభాషణలు సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.

అయితే సెకండ్ హాఫ్ వేగంగా సాగుతూ ఆకట్టుకోగా మొదటి అర్ధ భాగంలో ఒకే పాయింట్ చుట్టూ కథనం సాగడంతో కొంత నిర్బంధించిన భావన కలుగుతుంది. అయితే అది పెద్దగా ఎఫెక్ట్ పడకుండా రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం. అమ్మాయిల జీవితాల గురించి, స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయిల పట్ల సమాజం వ్యవహరించే తీరు గురించి, కోర్టులో అబ్బాయిల ను ఒక విధంగా, అమ్మాయిల ను ఒక విధంగా ప్రశ్నించడం వాటిపై పవన్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తాయి.

ఇంకా సినిమా కి అనుగుణంగా వచ్చే పాటలు ఆకట్టుకుంటాయి. అయితే ఇందులో శృతి హాసన్ కు క్యారెక్టరుకు పెద్దగా స్కోప్ లేదు. అయితే పవన్ సైతం బిగినింగ్ లో దాదాపు 15 నిమిషాల పాటు కనిపించారు. అయినా ఆ సీన్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తాయి. అందుకే పవన్ లేని లోటు కనిపించదు. ఇక పవన్ కనిపించిన ప్రతి సీన్ బాగుంటుంది. పాటలు ఉన్న ఒక్క ఫైట్ సమయానుకూలంగా మార్చిన విధానం బాగుంది.

నటీనటులు:

వకీల్ సాబ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉన్న పవర్ కాస్ట్ ను పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ను చూడవచ్చు. చాలా ఎమోషనల్ సీన్స్ లో పవన్ నటన ఆకట్టుకుంది. ఇక పవన్ కి ఆపోజిట్ గా ప్రకాష్ రాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్ ని మరింత హైలైట్ చేసే ఎలా ఉంది. అంజలి, నివేద థామస్, అనన్య అద్భుతంగా నటించారు. సుబ్బరాజు, వంశీకృష్ణ ఆకట్టుకున్నారు. అనసూయ, ఆనంద చక్రపాణి ఆకట్టుకున్నారు. ఇక శృతి హాసన్ కి పెద్ద క్యారెక్టర్ ఏమీ లేదు. ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. మిగతా వారి పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక విషయాలు:

సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడు వేణు శ్రీరామ్ అందరికీ తెలిసిన కథను పవన్ కు తగ్గట్టు మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. పవన్ కు తగ్గట్టుగా ఆ విధంగా చేసిన మార్పులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ వేగం పెంచితే ఇంకా బాగుండేది. అయితే ఈ తరహా సినిమాలో అంతకంటే ఆశించడం మంచిది కాదు. ఇక తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు మాత్రమే కాదు, నేపథ్య సంగీతం కూడా బాగుంది. వినోద్ సినిమాటోగ్రఫీ సూపర్ చాలా సన్నివేశాలు అందంగా అలరించేలా ఉన్నాయి. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ అభిమానులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

వకీల్ సాబ్ మూవీకి మేము ఇస్తున్న రెట్టింగ్: 3/5

 

image source

x