పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ డైరెక్షన్ వహించారు. బోనికపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కి జోడిగా శృతి హసన్ నటించగా, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రకాష్ రాజు కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల అవుతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ దగ్గర ఉండటం తో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ ను తాజాగా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారో లేదో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. ముఖ్యంగా వ్యూస్ విషయంలోనూ లైక్స్ విషయంలోనూ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. చూస్తుంటే గంటగంటకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే రేంజ్ లో పరుగులు పెడుతుంది.
వకీల్ సాబ్ ట్రైలర్ రివ్యూ :
ఇక ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే మిస్ పల్లవి మీరు వర్జీనేనా అని కోర్ట్ బోన్ లో ఉన్న నివేద థామస్ ను లాయర్ పాత్రధారి ప్రకాష్ రాజ్ ప్రశ్నించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. స్నేహితులను నమ్మి కొందరు అబ్బాయిలు చేతిలో మోసపోయి లైంగిక దాడికి గురైన ముగ్గురు యువకుల కథ ఈ చిత్రం అని తెలుస్తోంది. ఇక ఎలాంటి సపోర్ట్ లేని ఆ ముగ్గురు అమ్మాయిల తరుపున వాదించే వకీలు గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు దీనిని కమర్షియల్ సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఇక ట్రైలర్ లో ఇందులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంది అని తెలియజేశారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్టు డ్రామా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని, ఈ చిత్రం ప్రధాన కథ మిస్ కాకుండా భారీ మార్పులు చేర్పులు చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇక లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఆయన చెప్పే డైలాగ్స్ చేసే ఫైట్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంజలి, నివేద థామస్, అనన్యమంచి నటనను కనబరచినట్లు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ గారు నువ్వు వర్జీనేనా అని కోర్ట్ బోనులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించడం, ఇది ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా మీరు అయితే అమ్మాయిలను అడగొచ్చు నేను అబ్బాయిలను అడగ కూడదా అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఇక దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు పెంచిన వకీల్ సాబ్ వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.
వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డ్స్ :
టైలర్ రిలీజ్ అయిన ఏడు నిమిషాల్లోనే 100k లైక్స్ ను దాటేసింది. అలాగే 19 నిమిషాల్లోనే 200k లైక్స్ ను దాటేసింది. ఇప్పటివరకు ప్రభాస్ పేరిట ఉన్న యూట్యూబ్ రికార్డ్ లు పవర్ స్టార్ ఎంట్రీతో పవర్ స్టార్ చేతిలోకి వచ్చాయి. అదే విధంగా తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సమయంలో 1M వ్యూస్ సాధించిన ఘనత కూడా వకీల్ సాబ్ టైలర్ సొంతం చేసుకోండి. ఈ ట్రైలర్ పది నిమిషాలకే 4.2 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకొని రికార్డు సృష్టించింది. ఎంత పెద్ద రికార్డు లు అయిన బ్రేక్ చేయడం పవన్ కళ్యాణ్ వల్లే అవుతుంది అని మళ్లీ రుజువు అయింది.