పవన్ కళ్యాణ్ మూడు సవంత్సరాల గ్యాప్ తర్వాత తీసిన సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో న్యాయవాది పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా థియేటర్లలో చూడని వారికీ ఒక శుభవార్త. ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుంది.

వకీల్ సాబ్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీని మే 7 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలనుకునట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో మే 7 న ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయితే ఈ సినిమా థియేటర్స్ లో చూడని వారికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. కరోనా కేసులు పెరిగిపోవడం తో లాక్ డౌన్ పెట్టె ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి, దీనితో ప్రజలు మరియు చాలా కంపెనీలల్లో పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇళ్ళల్లో ఉంటారు. ఈ సినిమాలను వారి టివిలలో మరియు వారి ఫోన్స్ లో వారి ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు.

ఈ సినిమా పింక్ యొక్క రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాను శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఇది విదేశీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ (సత్యదేవ్) మరియు ప్రకాష్ రాజ్ (నందా) ల మధ్య వచ్చిన సన్నివేశాలు ఇంకా తమన్ యొక్క నేపథ్య స్కోరు మరియు కోర్టు దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

x