మూడు సవంత్సరాల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’ ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లో తుఫాను పుట్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. సినిమాను ఏప్రిల్ 30 న OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మూడు వారాలు కాలేదు మరియు ఇది పెద్ద హీరో సినిమా, ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. ఈ సినిమా ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరియు తెలంగాణలోని థియేటర్లు పూర్తిగా మూసివేయబడటం వల్ల, ఏపీ లో కూడా థియేటర్లు యాభై శాతం సిట్టింగ్ సామర్థ్యంతో నడుస్తున్నా కారణంగా ఈ సినిమాను OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నారనుకుంటా.

అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ‘వకీల్ సాబ్’ యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ లో మే 7 న ప్రసారం అవుతుందని మొదట్లో పుకార్లు వచ్చాయి, కానీ ఈ సినిమా ఒక వారం ముందే ఏప్రిల్ 30న వస్తోంది.

‘వకీల్ సాబ్’ సినిమా ‘పింక్’ యొక్క రీమేక్ మరియు ఈ సినిమాను శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. పవన్ ఈ సినిమాలో ఒక న్యాయవాది పాత్రను పోషించాడు. అతని నటన పవర్‌స్టార్ అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

x