పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వర్షిణి బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షో లతోనే ఫుల్ పాపులర్ అయింది. అంతకముందు ఆమె ఒక సినిమాలో నటించింది. కానీ, ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. పెళ్లిగోల వెబ్ సిరీస్ తర్వాత వర్షిణి ‘ఢీ’ షోతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది.
ఢీ షోతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు పటాస్ షోలో యాంకర్ గా ఆఫర్ వచ్చింది. వర్షిణి వచ్చాక పటాస్ షో మరింత క్లిక్ అయింది. ఇలా నెమ్మదిగా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ కొన్ని షో లతో బిజీగా ఉంది.
ప్రస్తుతం ఆమె ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో వర్షిణికి ఒక ముఖ్యమైన పాత్ర దక్కినట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆమెను సినిమాలోకి తీసుకున్నారు.
ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ, గుణశేఖర్ లాంటి డైరెక్టర్ కింద పనిచేయడం చాలా గొప్ప అనుభవం అని ఆమె పేర్కొన్నారు. షూటింగ్ లో తన మొదటి రోజున నటి సమంత తో స్క్రీన్ పంచుకోవాల్సి వచ్చినందున కొంత టెన్షన్ పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.