ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలం అయింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా చిత్రీకరణ చాలా ఆలస్యం అయింది. గత ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈరోజు (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా మూవీ మేకర్స్ సినిమాకు సంబందించిన ఒక గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో రన్ టైమ్ తక్కువగా ఉన్న బాక్సింగ్ చేస్తున్న వరుణ్ తేజ్ పాత్రను బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు.

 

x