మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకేసారి రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య మూవీ. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది, మరొకటి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న లూసిఫర్ రీమేక్. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది.

ఈ రెండు సినిమాలే కాకుండా చిరంజీవి మెహర్ రమేష్ మరియు బాబీతో సినిమాలు చేయనున్నారు. రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా, ఉదయం 9 గంటలకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్ డేట్ ఇవ్వనున్నట్లు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేసారు. దీంతో ఆ అప్డేట్ ఏంటా? అని మెగా అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ యొక్క అధికారిక రీమేక్ గా తెరకెక్కనుంది. మెహర్ రమేష్ తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ కథలో కొన్ని మార్పులు చేయనున్నారు. చిరంజీవి ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతకం పై రామ్ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

x