వెంకటేష్ నారప్ప సినిమా అసురాన్ సినిమాకు రీమేక్. మొదట ఈ సినిమాను మే 14 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం చెప్పారు. కానీ ఇప్పుడు మన ప్రేక్షకుల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.
“కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా నారప్ప సినిమాను మే 14 న విడుదల చేయలేకపోతున్నాము. ఈ కరోనా కేసులు కాస్త తగ్గినా తర్వాత కొత్త రిలీజ్ తేదీ ని విడుదల చేస్తాము, సురక్షితంగా ఉండండి ”అని విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి ట్వీట్ చేశారు.
In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
Stay safe ?! #NarappaPostponed#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/7QWIL8lOG6— Venkatesh Daggubati (@VenkyMama) April 29, 2021
అయితే, ఈ సినిమా ప్రత్యక్ష OTT విడుదల ఉండవచ్చని కొన్ని పుకార్లు వచ్చాయి. ఈ కరోనా కాలంలో అనేక సినిమాలు విడుదలకు OTT ప్లాట్ ఫామ్ ను ఎంచుకోవడంతో, వెంకటేష్ యొక్క నారప్ప సినిమా కూడా OTT ప్లాట్ ఫామ్లో విడుదల ఉండవచ్చని పుకార్లు వచ్చాయి. కానీ ఆ పుకార్లు అన్ని అబద్ధమని నిరూపిస్తూ, ఈ చిత్రం యొక్క కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని అధికారికంగా చెప్పారు.
ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, ఈ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు మరియు దీనికి మణి శర్మ సంగీతం అందించారు.