బాలకృష్ణ లాగా మరో సీనియర్ హీరో హోస్ట్ గా మారనున్నారు. అసలు మాట్లాడటానికి ఆ హీరో పెద్దగా ఇష్టపడ్డారు. అలాంటి ఆ హీరోను తెలుగు పోగ్రామ్ షో కు హోస్ట్ గా పెట్టనున్నారు.

అందరికంటే ముందు నాగార్జున, చిరంజీవి హోస్ట్ గా కనిపించారు. చిరంజీవి “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో తో, నాగార్జున బిగ్ బాస్, మరియు “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో తో హోస్ట్ గా మారారు. కాస్త లేట్ అయినా బాలయ్య మాత్రం “అన్‌స్టాపబుల్” షో తో దూసుకుపోతున్నాడు. ఇండియాలోనే టాప్ 5 టాక్ షో గా ఈ షోని నిలబెట్టాడు.

ఇదే దారిలో వెంకటేష్ కూడా నడుస్తున్నారు. మొదట్లో బాలకృష్ణ యాంకర్ అంటే చాలా మంది నవ్వారు.. అసలు చేయగలరా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ టాక్ షో కి వస్తున్నా ఆదరణ తో ఆహా ఓటిటి మరో సీనియర్ హీరో వెంకటేష్ ను హోస్ట్ గా చేయబోతుంది. ఇప్పటికే వెంకటేష్ తో సంప్రదింపులు జరిపారని సమాచారం.

బాలకృష్ణ ను హోస్ట్ గా చేసిన ఆహా.. వెంకటేష్ ను కూడా హోస్ట్ గా మారుస్తుంది. మరి వెంకటేష్ హోస్ట్ గా షో ను ఎలా నడిపిస్తారు అన్న ఆసక్తి నెలకొంది.

x