విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం “నారప్ప”. ఈ సినిమా హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ చిత్రానికి అధికారిక రీమేక్. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్.థాను మరియు సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు.

నారప్ప సినిమా డిజిటల్ విడుదల వైపు వెళ్తున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుండి వెంకటేష్ అభిమానులు అతని మనసు మార్చుకోవాలని అభ్యర్థనలు పంపుతున్నారు. కానీ, వెంకటేష్ నారప్ప మరియు దృశ్యం 2 రెండు సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. హీరో వెంకటేష్ ఈ రోజు నారప్ప విడుదల గురించి వార్తలను పంచుకుంటూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంఫర్ట్ అండ్ సేఫ్టీతో చూడవచ్చని వెల్లడించారు.

జూలై 20న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా వెంకటేష్ యొక్క కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటించింది. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

x