మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ తన ట్విట్టర్ ద్వారా మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ లోని వారందరిని కేవలం అల్లు అర్జున్ బంధువులుగా మాత్రమే ఇండియా గుర్తు పెట్టుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మెగా కుటుంబానికి నేరుగా రక్త సంబంధం లేకపోయిన, అల్లు అర్జున్ ఒక్కడే భవిష్యత్తులో కొత్త మెగాస్టార్ అని వర్మ ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీలో ఎవరితోను అల్లు అర్జున్ ను కంపేర్ చేయలేము అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం విశేషం గా మారండి.

x