సీనియర్ నటి ‘జయంతి’ అనారోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 76 సంవత్సరాలు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను జూలై 7న బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు ఉదయం కన్ను మూశారు.

ఆమె మరణ వార్తను కృష్ణ కుమార్ ఈరోజు ఉదయం మీడియాకు తెలియజేశారు. ఆరు దశాబ్దాలుగా ఉన్న తన సినీ కెరియర్లో కెనడా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ వంటి భాషల్లో ఆమె 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమెకు 7 కన్నడ స్టేట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సౌత్ నుంచి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

బడిపంతులు, దేవదాసు, జస్టిస్ చౌదరి, కలియుగ పాండవులు, స్వాతికిరణం, పెదరాయుడు మరియు కంటే కూతుర్నే కను వంటి చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆమె మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

x