డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు మనకు తెలుసు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కునున్న ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా ద్విపాత్రాభినయం చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతుంది.

బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, రానా దగ్గుబాటి మరియు విజయ్ దళపతి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ అట్లీ హీరో విజయ్ తో మూడు సినిమాలను తెరకెక్కించారు. ఆ మూడు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది కనుక, అట్లీ అడగగానే విజయ్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా మరియు క్రిమినల్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియమణి, యోగి బాబు మరియు సాన్యా మల్హోత్రా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణేలో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

x