పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒకేసారి నాలుగు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇదే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. వీటిలో ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పై ఉంది.

ఆ తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను పట్టాలు ఎక్కించబోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వారి కంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీని పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

x