విజయవాడ వాంబే కాలనీలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన సొంత ఇద్దరి పిల్లలను మరియు భార్యను అతికిరాతకంగా చంపినా ఓ భర్త.. వారిని చంపినా వెంటనే ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. విజయవాడ వాంబే కాలానికి చెందిన నీలవేణి మోహన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. మోహన్ తన ఆర్థిక సంపాదనకు మించి భారీ అప్పులు చేయడం తో పాటు తరచూ తన భార్యను వేధిస్తూ ఉండేవాడు.

ఈ నేపథ్యంలో వారికీ జరిగిన గొడవలో మోహన్ తన సొంత పిల్లలను మరియు భార్యను చంపి పారిపోయాడు. ఉదయం స్థానికులు రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని చూచి బయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి నుండి పారిపోయిన మోహన్ కోసం పోలీసులు వెతుకుతుండగా, భార్య పిల్లలను చంపి పారిపోయిన మోహన్ ఆత్మహత్య చేసుకోవడం కోసం రైలు పట్టాల దెగ్గరికి వెళ్ళాడు.

ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లో ట్రైన్ దగ్గరికి వచ్చే సరికి భయంతో పక్కకు తప్పుకునే ప్రయత్నంలో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరంహాసిపిటల్లో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

x