ప్రస్తుతం బిగ్ బాస్ షో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కారణం ఏమిటంటే త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కానుంది. దీంతో ఎవరెవరు ఈ సారి హౌస్ లోకి వస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సీజన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జులై రెండో వారంలో ఈ షో ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఐదో సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. వారం, పది రోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్ ను ఖరారు చేసి వారిని క్వారంటైన్ లో ఉంచిన తరువాత సీజన్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ప్రతి సీజన్లో కనీసం ఒక హీరోయిన్ ను బిగ్ బాస్ షో లోకి తీసుకురావడం ఆనవాయితీగా మారింది.

ఐదో సీజన్లో కూడా అదే ఆనవాయితీని కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఈసారి ఆ అవకాశం ఆర్ ఎక్స్ 100 బ్యూటీ “పాయల్ రాజ్‌పుత్” కు దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఐదో సీజన్ కు కంటెస్టెంట్ గా రావాలని పాయల్ రాజ్‌పుత్ ను నిర్వాహకులు కోరారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని ఆఫర్ చేయడంతో పాయల్ రాజ్‌పుత్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ పాయల్ రాజ్‌పుత్ కనుక బిగ్ బాస్ షోలో కి వస్తే గ్లామర్ కు డోకా ఉండదని చెప్పవచ్చు.

x