పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరు మండలం, ఇంజరం గ్రామంలో ఒక బావిలో గేదె పడిపోయింది. మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు నీళ్ల బావి లో పడింది. ఫైర్ సిబ్బంది సాయంతో గేదెను గ్రామస్తులు రక్షించారు. బావిలో పడిపోయిన గేదెను బయటకు తీసుకొచ్చేందుకు గ్రామస్తులు చిన్నపాటి ఆపరేషనే చేపట్టారు. గేదె ను ఎలాగైనా రక్షించాలని మొదట గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించారు.
తాళ్లు కట్టి గేదెను పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా తాళ్లు తెగిపోవడంతో గేదె మళ్ళీ బావిలో పడిపోయింది. ఈ ప్రయత్నంలో ఒకరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ లోగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో గేదె ను తాళ్లు తో బంధించి టాక్టర్ కు కట్టి పైకి లాగారు. బావిలో పడిన గేదె ను రక్షించిన ఏసు, ప్రసాదు లను స్థానికులతో పాటు ఫైర్ సిబ్బంది అభినందించారు.