విపరీతంగా కరోనా కేసులతో బాధపడుతున్న భరత్ కు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారత్ సంస్థకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా కుటుంబం 10 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం ప్రకటించింది. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సమకూర్చేందుకు ఉపయోగించమని వినోద్ ఖోస్లా ట్వీట్ చేశారు.

గతంలో కూడా వివిధ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ వసతుల కోసం విరాళాలు అందచేసిన అయిన తాజాగా మరోసారి విరాళం అందించారు. భరత్ కు ఈ సాయం సరిపోదు అన్న ఆయన మరింత సాయం చేసేందుకు ప్రముఖులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వినోద్ ఖోస్లా కూడా ఆక్సిజన్ సరఫరా కోసం ఆసుపత్రులకు నిధులు సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిరోజూ భారతదేశం అంతటా హాస్పిటల్స్ నుండి ఆయనకు వచ్చే అభ్యర్థనలు ఏమిటంటే, 20,000 ఆక్సిజన్ సాంద్రతలు, 15,000 సిలిండర్లు, 500 ఐసియు పడకలు, 100 వెంటిలేటర్లు, 10,000 పడకల COVID కేంద్రాల కోసం వారికి అభ్యర్థనలు వచ్చాయని” ఖోస్లా అన్నారు.

ఫార్మా దిగ్గజం “ఫైజర్” కూడా భారత్కు చేయూతను ఇచ్చింది. భారత్కు 510 కోట్ల రూపాయల విలువైన ఔషధాలను ఉచితంగా పంపుతామని ఫైజర్ సి ఈ ఓ చెప్పారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని అయన చెప్పారు.

గత 24 గంటల్లో భారత్‌లో 3.92 లక్షల తాజా కేసులు నమోదయ్యాయి. భరత్కు విదేశీ సహాయాలు మరియు దేశవ్యాప్తంగా పెద్ద పెద్దల నుండి పెద్ద మొత్తంలో మద్దతు మరియు సహాయం లభిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న, తెలంగాణలోని సికింద్రాబాద్ లో గాంధీ ఆసుపత్రికి 50 ఆక్సిజన్ సిలిండర్లను డిఆర్డిఓ ద్వారా అందజేశారు.

x