ఆనంద్ శంకర్ దర్శకత్వంలో హీరో విశాల్ మరియు ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం “ఎనిమీ”. తాజాగా చిత్రబృందం ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాలో మృణాళిని రవి, మమత మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కునున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

 

x