నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తెలుగువాడు అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరో స్థానం సంపాదించుకున్న విశాల్ ప్రస్తుతం “నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌” అనే సినిమా చేస్తున్నారు. శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోగా విశాల్ కు ఇది 31వ సినిమా. మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ చిత్రీకరిస్తున్నారు.

ఇందులో భాగంగా మేకర్స్ విశాల్ తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాన్ని చూసి చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో విశాల్ వెన్నెముకకు బలంగా దెబ్బ తగిలింది. ప్రస్తుతం విశాల్ వైద్యుల సమక్షంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది. విశాల్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం ‘యాక్షన్’ అనే భారీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అంతగా ఆడలేదు. దీంతో విశాల్ మరోసారి తన కెరియర్ పై దృష్టిని కేంద్రీకరించారు.

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేశారు. ఇందుకోసం విశాల్ తన 31వ సినిమాలో డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ భిన్నమైన లుక్ లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు.

x