బీసీసీఐ ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసేసింది. ఇంక ఈ అద్భుతమైన 14వ సీజన్ ఆడటానికి అందరు ఆటగాళ్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ కోసం సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భారత్ కు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ను డేవిడ్ వార్నర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.

ఈ పోస్టులో తన భార్య అయిన క్యాండీస్ వార్నర్ తో కలిసి మన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వైన్ తాగుతూ కనిపించాడు. ఈ ఫోటోకి డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో ఒక స్మైల్ ని ఇచ్చారు. ఇంకా ఈ ఐపీఎల్ 14వ సీజన్ కోసం భారత్ కు బయలుదేరటానికి సమయం ఆసన్నమైంది. మిస్ యూ బంగారం, నా డార్లింగ్ తో ఇదే చివరి పెగ్ అంటూ డేవిడ్ వార్నర్ రాసుకొచ్చాడు.

టీం ఇండియా సిరీస్ కు గాయం కారణంగా దూరమైన డేవిడ్ వార్నర్, పూర్తిగా కోల్పోకుండానే టెస్ట్ సిరీస్ ఆడారు. దానితో అతని గాయం ఇంకాస్త పెరిగింది, దాని నుంచి అతను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అతడు ఈ ఐపీఎల్ కొన్ని మ్యాచ్ లకు దూరమవుతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ డేవిడ్ వార్నర్ ఆ గాయం నుంచి త్వరగా కోలుకొని దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్లో సెంచరీ చేసి మళ్ళీ తిరిగి తన ఫామ్ ని అందుకున్నారు.

2 రోజుల క్రితం, 2021 ఐపీఎల్ 14 వ సీజన్ కోసం భారత్ కు వస్తున్నాను అని డేవిడ్ వార్నర్ స్వయంగా వెల్లడించాడు. డేవిడ్ వార్నర్ భారత్ కు వచ్చేముందు తన పిల్లలతో కలిసి డిన్నర్ చేశానని, అంతే కాకుండా ఎంతో ఆనందంగా తన ఫ్యామిలీతో గడిపానని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనితో డేవిడ్ వార్నర్ ఐపీఎల్ సీజన్ కోసం భారత్ కు వచ్చేసారు అని అందరూ అనుకున్నారు, కానీ ఈరోజు చేసిన తాజా పోస్ట్ ద్వారా ఇంకా రాలేదు అని అర్థమవుతుంది.

డేవిడ్ వార్నర్ భారత్ కు వచ్చిన తర్వాత వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. దీని ప్రకారం డేవిడ్ వార్నర్ తన టీం తో కలిసే సరికి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు భారత్ కు వచ్చే వారం రోజుల పాటు పాలెం టైంలో ఉండాలన్నారు. ఐపీఎల్ పద్నాలుగో సీజన్లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్స్ ఆడనున్నారు. ఇంకా సన్రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 11న కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరగనుంది.

image source

x