ప్రముఖ కోలీవుడ్ నటుడు వివేక్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నైలోని ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉందని, ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నామని డాక్టర్స్ చెబుతున్నారు.

వివేక్ నిన్న గురువారం, ప్రభుత్వ ఓమందురార్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నాడు. అతను ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఒక రోజు తరువాత, వివేక్ తీవ్ర అస్వస్థత కు గురైయ్యాడు ఒక్క సరిగా గుండె పోతూ రావడం తో కుప్పకూలిపోయారు. దీనితో వివేక్ ను చెన్నై లోని సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వివేక్ కార్డియాక్ అరెస్ట్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు వైద్యులు. ప్రసుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రసుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

59 సవంత్సరాలు కలిగిన వివేక్ నిన్న కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. అందరు కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నుంచి సురక్షతంగా ఉండటానికి తగిన జాగత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించిన టీకా ఒక్కటే కరోనా నుంచి కాపాడుతుంది అని ఆయన చెప్పారు.

సోషల్ మీడియా లో ఎప్పుడు చురుగ్గా ఉండే వివేక్ తాను కోవిడ్ వాక్సిన్ తీసుకున్న సంగతి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇంతలోనే అతనికి గుండెపోటు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.వివేక్ కోలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

x